Under-19 T20 World Cup Highlights : అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈక్రమంలోనే టీంఇండియా సెమీస్‌కు చేరింది.

Under-19 T20 World Cup
T20 Women World Cup | Mega9.in

అండర్-19 వరల్డ్ కప్ సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఆదివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులే చేసింది.

Under-19 T20 World Cup 2025లో టీంఇండియా జైత్రయాత్ర..

అనంతరం స్వల్ప లక్ష్య్యంతో బరిలోకి దిగిన టీంఇండియా 7.1ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయం దక్కడంతో భారత మహిళల జట్టు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

అండర్-19 మహిళల టీ20 జట్టు వరుస విజయాలు సాధిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోష్ తో సెమీస్ లో రాణించి ఫైనల్లో సైతం విజయం సాధించాలని క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు.

Read more : Champions Trophy 2025 : భారత్-పాక్ మ్యాచ్ లు ఎప్పుడంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *