Union Budget 2025-26 Highlights : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (2025 ఫిబ్రవరి 1)న లోక్ సభలో 2025-26 ఏడాదికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ప్రతిసారీలానే ఈసారి కూడా ఆమె చేనేత చీరను ధరించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారు రంగు అంచుతో గోధుమ వర్ణం చేనేత చీర.. ఎరుపు రంగు బ్లౌజ్.. శాలువాతో ఆమె కన్పించారు. ఈ చేనేత చీరను ఆమెకు బీహార్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి బహుకరించారు.
మొత్తం బడ్జెట్ : 50, 65,345 కోట్లు
రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు
మూలధన వసూళ్లు రూ. 16,44,936 కోట్లు.

Union Budget 2025-26 : శాఖల వారీగా కేటాయింపులు..
రక్షణ శాఖ రూ.4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ది రూ.2,66,817 కోట్లు
హోంశాఖ రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1,71,437 కోట్లు
విద్య రూ.1,28,650 కోట్లు
ఆరోగ్యం రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ది రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం రూ.95,298 కోట్లు
విద్యుత్ రూ.81,174 కోట్లు
వాణిజ్యం, పరిశ్రమలు రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమం రూ.60,052 కోట్లు..
Read more : Health Tourism Hub : హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ
యూనియన్ బడ్జెట్ 2025లో మధ్యతరగతి వేతన జీవులకు కేంద్రం బిగ్ రిలీప్ ప్రకటించింది. 12లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.
మధ్యతరగతి ప్రజలను ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు 80వేల వరకు ఆదా అవుతుందన్నారు.
స్మాల్ టాక్స్ ప్లేయర్లకు టీడీఎస్ లేదని తెలిపారు. బీమారంగంలో వందశాతం ఎఫ్డీఐలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఇన్ కమ్ టాక్స్ లోని అనవసర సెక్షన్లను తొలగించనున్నట్లు ప్రకటించారు.
- కొత్త పన్ను స్లాబులు..
రూ. 0-4 లక్షలు సున్నా
రూ. 4-8 లక్షలు 5శాతం
రూ. 8-12 లక్షలు 10శాతం
రూ.12-16 లక్షలు 15శాతం
రూ. 16-20 లక్షలు 20శాతం
రూ. 20-24 లక్షలు 25శాతం
రూ. 24లక్షలపైన 30శాతం.
- బీహార్ కు అధిక ప్రాధాన్యం..
ఈ ఏడాదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత దక్కింది. 50వేల హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ కు ఆర్థికసాయం ప్రకటించారు.
ఐఐటీ పాట్నా సామర్థ్యం విస్తరణ. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా గ్రీన్ఫోల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు. రైతులను ప్రోత్సహిస్తూ మఖానా బోర్డు ఏర్పాటు వంటి వాటిని బడ్జెట్లో ప్రకటించారు.
- కిసాన్ క్రిడిట్ కార్డు (Kisan Credit Card Limit) పరిమితి పెంపు..
కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుంచి 5లక్షల వరకు పెంచుతున్నట్లు యూనియన్ బడ్జెట్ 2025లో ప్రకటించారు. రాష్ట్రాల సహకారంతో దేశంలోని 100 జిల్లాల్లో రైతుల కోసం ధన్ ధ్యాన్య్ కృషి యోజన అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
పట్టణ పేదలకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు 30వేల పరిమితితో తీసుకురానున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.. గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
- విద్య రంగంలో ఏఐ (AI Technology) సేవలు..
విద్యారంగంలో ఏఐ సేవలు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ ఫామ్ టెక్ట్స్ బుక్స్.. అదనంగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకున్నారు. పదేళ్లలో ఐఐటీ సీట్లు రెట్టింపు కానున్నాయని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ స్కీమ్ (Term Loan Scheme) ను కేంద్రం అమలు చేయనుంది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు (Budget 2025 for Stock Market)..
లోక్ సభలో 2025-26 ఆర్థిక సంవత్సరం బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తుండగానే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 297 పాయింట్లు.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.