Unsold Players in IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. ఆటగాళ్లపై ప్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశాయి. అయితే ఈ జాబితాలో కొందరు స్టార్ ఆటగాళ్ళను ప్రాంచైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో పలువురు భారత, విదేశీ స్టార్ ఆటగాళ్ళు అన్ సోల్డ్ (Unsold Players ) జాబితాలో చేరిపోయారు.

ఐపీఎల్ 2025 మెగా వేలం అంచనాలను మించి సాగింది. తొలిరోజే ప్రాంచేజీలు స్టార్ ఆటగాళ్ళను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఆదివారం నాడు భారీగా వ్యయం చేసిన ప్రాంచైజీలు సోమవారం ఆచితుచీ ముందుకెళ్లాయి. జట్టు బలోపేతం, ఆటగాళ్ళ నైపుణ్యాలను ఎంపిక చేసుకొని ఖర్చు చేశాయి.
రెండోరోజు భారత పేసర్లకు మంచి డిమాండ్ నెలకొంది. మొత్తంగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో 10 ప్రాంచైజీలు 182మంది ఆటగాళ్ళను కొనుగోలు చేయడానికి ఏకంగా రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. అయితే అనుహ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్ళను కనీన ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ప్రాంచైజీలు ముందుకు రాలేదు.
ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లతోపాటు విదేశీ ఆటగాళ్ళు సైతం ఉన్నారు. ఇందులో దిగ్గజ ఆటగాళ్ళతోపాటు స్టార్ ప్లేయర్స్ సైతం ఉండటం గమనార్హం. అన్ సోల్డ్ జాబితాలో (Unsold Players) ఉన్న ప్లేయర్స్ ఒకసారి పరిశీలిస్తే..
డేవిడ్ వార్నర్ – రూ. 2 కోట్లు
కేన్ విలియమ్సన్ – రూ. 2 కోట్లు
శార్దూల్ ఠాకూర్ – రూ. 2 కోట్లు
ఉమేశ్ యాదవ్ – రూ.2 కోట్లు
ఫిన్ అలెన్ – రూ.2 కోట్లు
జానీ బెయిర్లో – రూ.2 కోట్లు
బెన్ డకెట్ – రూ.2 కోట్లు
స్టీవ్ స్మిత్ – రూ.2 కోట్లు
ముజీబుర్ రెహ్మన్ – రూ.2 కోట్లు
అదిల్ రషీద్ – రూ.2 కోట్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ – రూ.2 కోట్లు
నవీనుల్ హక్ – రూ.2 కోట్లు
అల్ట్రారీ జోసెఫ్ – రూ.2 కోట్లు
ఆడమ్ మిల్నే – రూ.2 కోట్లు
క్రిస్ జోర్డాన్ – రూ.2 కోట్లు
డారిల్ మిచెల్ – రూ.2 కోట్లు
గాస్ అట్కిన్సన్ – రూ.2 కోట్లు
తబ్రెజ్ షంసి – రూ.2 కోట్లు
జాసన్ హోల్డర్ – రూ.2 కోట్లు
అకీలా హోస్సేన్ – రూ.1.50 కోట్లు
సికిందర్ రజా – రూ.1.50 కోట్లు
కైల్ మేయర్స్ – రూ.1.50 కోట్లు
మైకేల్ బ్రాస్వెల్ – రూ.1.50 కోట్లు
టామ్ లాథమ్ – రూ. 1.50 కోట్లు
టిమ్ సౌథీ రూ.1.50 కోట్లు
మహమ్మద్ నబీ – రూ.1.50 కోట్లు
షై హోప్ – రూ.1.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ – రూ.కోటి
షకీబ్ అల్ హసన్ – రూ. కోటి
కృష్ణప్ప గౌతమ్ – రూ. కోటి
అలెక్స్ కేరీ – రూ. కోటి
పృథ్వీ షా – రూ. 75 లక్షలు
సర్ఫరాజ్ ఖాన్ – రూ. 75 లక్షలు
డేవాల్డ్ బ్రెవిస్ – రూ.75 లక్షలు
పాథుమ్ నిశాంక – రూ. 75 లక్షలు
కేశవ్ మహరాజ్ – రూ. 75 లక్షలు
పీయూష్ చావ్లా – రూ. 50 లక్షలు
నవదీప్ సైని – రూ. 75 లక్షలు
శివమ్ మావి – రూ.75 లక్షలు
దిల్షాన్ మధుశంక – రూ. 75 లక్షలు
రోస్టన్ ఛేజ్ – రూ.75 లక్షలు
కేఎస్ భరత్ – రూ.75 లక్షలు
లిటన్ దాస్ – రూ.75 లక్షలు
జోష్ లిటిల్ – రూ. 75 లక్షలు
చరిత్ అసలంక – రూ. 75 లక్షలు
దునిత్ వెల్లలాగె – రూ.75 లక్షలు
డాసున్ శనక – రూ. 75 లక్షలు.
Read Latest Sports News and Telugu News