E Flying Boat : చెన్నెకు చెందిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్ మద్రాస్ ఐఐటీ సహకారంతో ఈ-ఫ్లయింగ్ బోట్ ను ఆవిష్కరించింది. బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా-2025లో ఈ ఫ్లయింగ్ బోట్ ను ప్రదర్శించగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ ప్లయింగ్ బోట్ ఆవిష్కరణతో ప్రయాణ రంగంలో పెనుమార్పులు వచ్చే అవకాశముంది. ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలకు చెక్ పడనుంది.
ప్రయాణ ఖర్చు.. సమయం తగ్గనుంది. ఆటో మొబైల్ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుకు నాంది పలికే అవకాశముంది.
ఈ ప్లయింగ్ బోట్ (E Flying Boat)తో.. 3గంటల్లోనే చైన్నై టూ కలకత్తా
చైన్నె నుంచి కోలకత్తా మధ్యం దూరం సుమారు 1700 కిలోమీటర్లు. బస్సు, ట్రైన్లలో ప్రయాణిస్తే 24 గంటలకు పైన సమయం పట్టనుంది.
అయితే కేవలం రూ.600తో కేవలం మూడు గంటల్లోనే చెన్నై నుంచి కోలకత్తా ఈ ఫ్లయింగ్ బోట్ ద్వారా చేరుకోవచ్చు.

ఈ-ఫ్లయింగ్ బోట్ ‘వింగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ప్లై టెక్నాలజీస్.. మద్రాస్ ఐఐటీ సహకారంతో తయారు చేసింది.
దీనిని ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా-2025లో ప్రదర్శించగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
వింగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్.. సూత్రంపై ఆధారపడి ఈ-ఫ్లయింగ్ బోట్ పని చేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. గంటకు 500 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించనుందని తెలుస్తోంది.
2029 నాటికి చెన్నై టూ సింగపూర్ మధ్య ఈ-ఫ్లయింగ్ బోట్స్ అందుబాటులో తెచ్చేలా ప్రణాళిక రచిస్తోన్నట్లు వాటర్ ఫ్లై టెక్నాలజీస్ వెల్లడించింది.
ట్రాఫిక్ మరియు పోలూష్యన్ సమస్యలు తగ్గించేలా వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్ సంస్థను పలువురు అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’
Viral Reels : రీల్స్ చేద్దామని నమ్మించి.. తాళి కట్టాడు..!