Waves OTT Prasar Bharati : కరోనా మహమ్మరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓటీటీలా హవా పెరిగిపోయింది. థియేటర్లకు వెళ్లకుండానే ప్రతీఒక్కరూ ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీసులు తదితర ప్రొగ్రాములన్నీ అస్వాదించడానికి అలవాటు పడ్డారు. కరోనా మహమ్మరి తగ్గిన తర్వాత కూడా ఓటీటీల హవా కొనసాగుతోంది.

అమెజాన్, నెట్ ఫిక్స్, ఆహా వంటి దిగ్గజ ఓటీటీలు రోజువారీ, నెలవారీ, సంవత్సరం వారీగా వీక్షకుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. వీడియో గేమింగ్, వినోద రంగానికి భారత్ కేరాఫ్ గా మారాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రజా ప్రసారాల సంస్థ ప్రసార భారతి సొంతంగా ఓటీటీని ప్రవేశపెట్టింది.
ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ను ‘వేవ్స్’ పేరుతో ఆవిష్కరించింది. ఇతర స్ట్రీమింగులకు భిన్నంగా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) సాయంతో ఈ ఓటీటీని రూపొందించారు.

వేవ్స్ ఓటీటీ (Waves OTT App )లో రామాయణం, మహాభారతం, రేడియో ప్రసారాలు, భక్తి పాటలు, ఆటలు, ఈ-బుక్స్ వంటి వాటిని ఉచితంగా అందించనున్నారు. మొత్తం 12 కంటే ఎక్కువ భాషల్లో 10కి పైగా కేటగిరిల్లో విభిన్నమైన కంటెంట్ ను యూజర్లకు అందించనున్నట్లు ప్రసార భారతి పేర్కొంది.
ఈ వేవ్స్ ఓటీటీలో 65 లైవ్ ఛానల్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెనాలీరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పెద్దల కోసం అలనాటి సినిమాలు, మధురమైన పాటలను ఓటీటీ ప్లాట్ ఫాంలో వీక్షకులకు కోసం చేర్చింది.
ప్రసార భారతికి చెందిన వేవ్స్ ఓటీటీని గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి సులభంగా డౌన్‌లోడ్ ( (Prasar Bharati Free OTT App Download ) చేసుకోవచ్చు. ఉచితంగా ఓటీటీలను వీక్షించాలని అనుకునే వారికి ‘వేవ్స్’ ఓటీటీ మంచి కాలక్షేపంగా మారనుంది. ఏదిఏమైనా కేంద్రం ప్రభుత్వం ఉచితంగా ఓటీటీని అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Read more : Pushpa-2 Advance Bookings పుష్ప-2 ఆల్ టైం రికార్డు